రానున్న రోజుల్లో వాట్సాప్ తీసుకొచ్చిన ఈ సీజర్ తో యూజర్లు వాయిస్ మెసేజ్, ప్లేబ్యాక్ వేగాన్ని నియంత్రించవచ్చు. అలాగే యూజర్లు ఎంపిక చేసుకున్న స్పీడులో మెసేజ్లను వినవచ్చు కూడా.. ఇక రానున్న రోజుల్లో వాయిస్ మెసేజ్ లను పంపేటప్పుడు, రివ్యూ బటన్ ఉండేలా వాట్సాప్ ఏర్పాటు చేస్తోంది. ఈ ఫీచర్ ను ఆండ్రాయిడ్, ios ఫోన్లలో కూడా వాట్స్అప్ తీసుకురానుంది. ఈ ఫీచర్ గనుక వాట్సాప్ లో అందుబాటులోకి వస్తే, ప్రతి ఒక్కరూ ఇతరులకు సందేహాలు పంపించడానికి మరింత మక్కువ చూపిస్తారు అనడంలో ఎలాంటి సందేహం లేదు.