కొవిడ్ రెండు వ్యాక్సిన్ లు వేయించుకున్న తర్వాత ఇచ్చే సర్టిఫికెట్ ల వల్ల ఏమైనా లాభం ఉందా? అంటే, కచ్చితంగా ఉంది అని చెప్పవచ్చు. ఈ సర్టిఫికెట్ ద్వారా విదేశాలకు వెళ్లేటప్పుడు ఎలాంటి ఆంక్షలు ఉండవు. సులభంగా విదేశాలకు వెళ్ళవచ్చు.ఇకపై ముందు ముందు ఒక వ్యక్తిని కొవిడ్ వేసుకున్నట్లు సర్టిఫికెట్ వుంటేనే, విదేశాలకు వెళ్లే అనుమతిని కూడా ఇస్తారట. ముఖ్యంగా కొవిడ్ టీకాలను తీసుకున్న వారినే అనుమతిస్తారు. వారిపై ఎలాంటి ఆంక్షలు ఉండవు. వారు మాస్కులను ధరించాల్సిన పనిలేదు.. అంటే.. అలాంటి సందర్భాల్లో ఈ సర్టిఫికెట్ అవసరం అవుతుంది. అలాగే వ్యాక్సిన్ తీసుకున్నట్లు రుజువు ఉంటుంది. ఇది హాస్పిటల్స్లో కూడా పనిచేస్తుంది. ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇతర అనారోగ్య సమస్యలకు చికిత్సను సులభంగా తీసుకోవచ్చు.