గూగుల్ మరొక కొత్త యాప్ ను విడుదల చేసింది. దీని ద్వారా ముఖ్యమైన డాక్యుమెంట్లను స్కాన్ చేయడంతోపాటు వాటి స్టోరేజీ, వాటి నిర్వహణకు కొత్త యాప్ ను సంస్థ అభివృద్ధి చేసింది. ఆ యాప్ పేరు స్టాక్ యాప్.యాప్ ద్వారా స్కాన్ చేస్తే డాక్యుమెంట్లలోని అకౌంట్ నెంబర్లు, బిల్లుల బకాయిలు, గడువు తేదీల వంటివాటి ముఖ్యమైన వివరాలను ఈ యాప్ గుర్తిస్తుంది. మనం కట్టవలసిన గడువు తేదీలను గురించి యూజర్లను అలర్ట్ కూడా చేస్తుంది. ఈ యాప్ ద్వారా డాక్యుమెంట్ల కాపీలను గూగుల్ డ్రైవ్ కు ఎక్స్ పోర్ట్ చేసి, సేవ్ చేసుకోవచ్చు.