AFA నిబంధనలకు లోబడి, నెలవారి సబ్స్క్రిప్షన్ ప్లాన్ రూ.129 ని తొలగించినట్లు అమెజాన్ పేర్కొంది. ఇకపై ప్రైమ్ మెంబర్షిప్ తీసుకోవాలనుకునే వారికి రూ.329 విలువచేసే మూడు నెలలు ప్లాన్, రూ. 999 విలువ గల యేడాది కాలం మాత్రమే అందుబాటులో తీసుకొచ్చింది. ఎవరైనా యూజర్స్ కొత్త ప్రైమ్ మెంబర్షిప్ కావాలనుకున్నవారు, లేదంటే పాత దాన్ని రెన్యువల్ చేసుకోవాలనుకున్నప్పుడు మూడు నెలలు లేదంటే ఏడాది సబ్స్క్రిప్షన్ మాత్రమే ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. ఈ నిర్ణయాన్ని మార్చి 31 నుంచి అమలు చేయాలని ఆర్బీఐ భావించగా, బ్యాంకులు, పేమెంట్ గేట్ వేల వినతి తో దీన్ని సెప్టెంబర్ 30 వరకు వాయిదా వేసింది.