షియోమీ సంస్థ ప్రవేశపెట్టిన ప్రో పవర్ బ్యాంక్ 30,000 ఎమ్ఏహెచ్ బ్యాటరీని కలిగి ఉంటుంది.దీన్ని ఒక్కసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే 6 వేల ఎంఏహెచ్ బ్యాటరీ కలిగి ఉన్న ఫోన్ కు ఐదు సార్లు, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ కలిగి వున్న ఫోన్ కు 6 సార్లు చార్జింగ్ పెట్టవచ్చు.పవర్ డెలివరీ పాయింట్ ద్వారా 24 w ఫాస్ట్ ఛార్జింగ్ ను ఇది సపోర్ట్ చేస్తుంది. అంటే కేవలం 7.5 గంటల్లోనే దీనిని పూర్తిగా ఛార్జ్ చేయవచ్చు. దీని ధర 2,299 రూపాయలు.