రైలు వెనుక X అని ఉంటే దాని అర్థం ,అది ఆ రైలు యొక్క చివరి పెట్టె అని అర్థం. ప్యాసింజర్ రైలు చివరి పెట్టెలో ఎక్స్ తో పాటు, LV అనే అక్షరాలు కూడా కనిపిస్తాయి. ఈ LV అంటే లాస్ట్ వెహికల్ అని అర్థం. ఈ రెండు సంకేతాలు ప్రధానంగా రైల్వే అధికారులు, ఉద్యోగులకు సంబంధించినవి. ఈ సంకేతాలకు, సామాన్యులకు ఎటువంటి సంబంధం లేదు. ఏదైనా రైల్వే అధికారి లేదా ఉద్యోగి రైలు చివరి పెట్టెలో వ్రాసిన X లేదా LV ని చూడకపోతే, అతను వెంటనే సమీప కంట్రోల్ రూమ్‌కు తెలియజేస్తాడు. ఈ రెండు సంకేతాలు రైలు చివరి కంపార్ట్మెంట్లో కనిపించకపోతే రైలు చివరి కంపార్ట్మెంట్ లేదా వెనుక భాగంలో కొంత భాగం రైలు నుండి వేరు చేయబడిందని అర్థం. అందుకే ఈ రెండు గుర్తులకు అంత ప్రాధాన్యత ఉంది.