ఎల్సీడీ టీవీలు ఎక్కువ విద్యుత్ శక్తిని వినియోగిస్తుండగా, ఎల్ఈడీ టీవీలు తక్కువ విద్యుత్ శక్తిని వినియోగిస్తాయి. ఎల్సీడీ టీవీలు, ఎల్ఈడీ టీవీల కన్నా కొంచెం చౌకగా ఉండగా, ఎల్ఈడీ టీవీలు కాస్త ఖరీదైనవి. ఎల్ఈడీ టీవీలు ఎల్సీడీ టీవీల కంటే ఎక్కువ ప్రకాశవంతంగా ఉండడం తోపాటు ఎక్కువ రంగులు కలిగి ఉంటాయి. ఎల్సీడీ టీవీలను 165 డిగ్రీల కోణం వరకు చూడవచ్చు. కానీ ఈ ఎల్సీడీ టీవీ స్క్రీన్‌పై ఉన్న చిత్రాలు ఇంటి అన్ని మూలల్లోనూ స్పష్టంగా కనిపించవు, టీవీ ముందు ఒక నిర్దిష్ట స్థలంలో కూర్చుంటే మాత్రమే కనిపిస్తుంది. ఎల్ఈడీ టీవీలు 180 డిగ్రీల వీక్షణలను అందిస్తున్నాయి. కనుక మీరు ఇంటి ఏ మూలన కూర్చున్న టీవీ తెరపై చిత్రాన్ని స్పష్టంగా చూడవచ్చు..మొత్తానికి చూసుకుంటే ఎల్సీడీ టీవీ ల కంటే ఎల్ఈడీ టీవీలు కొంచెం బెటర్ అని చెప్పవచ్చు