ఒకవేళ మీరు కూడా గతంలో ఆధార్ కార్డు చేయించుకొని ఉంటే, దానికి ఫోన్ నెంబర్ అనుసంధానం చేయకుండా ఉండింటే, ఆధార్ కార్డు కు మొబైల్ నంబర్ ను ఎలా లింక్ చేయాలో ఇప్పుడు తెలుసుకోండి.దగ్గర్లో ఉన్న ఆధార్ ఎన్రోల్మెంట్ సెంటర్ లకి బయోమెట్రిక్ అథెంటికేషన్ కోసం అభ్యర్థి నేరుగా వెళ్లాల్సి ఉంటుంది. ప్రస్తుతానికి ఈ సేవలను ఆన్లైన్లో అందుబాటులో కి తీసుకురాలేదు. కాబట్టి సెంటర్లకు నేరుగా వెళ్లాల్సి ఉంటుంది. అంతేకాకుండా ప్రస్తుతం ఈ సదుపాయాలను బ్యాంకుల్లో కూడా అమలు పరుస్తున్నారు. కేవలం యాభై రూపాయలు ఫీజు చెల్లిస్తే చాలు మొబైల్ నెంబర్ ను ఆధార్ కు లింక్ చేస్తారు.