ఆధార్ కార్డులో ఉన్న పేరును మార్చుకోవాలి అంటే, ssup.uidai.gov.in వెబ్ సైట్ కు వెళ్లాలి. ఇక ఈ వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత మీరు మీ 12 అంకెల ఆధార్ నెంబర్ తో లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. ఇక తర్వాత క్యాప్చా ను ఎంటర్ చేసి , వాటిపై క్లిక్ చేసిన తర్వాత ,మీ ఆధార్ నెంబర్ లింక్ చేయబడిన మొబైల్ నెంబర్ కు ఓటీపీ వస్తుంది. ఈ ఓటీపీ ఎంటర్ చేస్తే కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. ఇందులో అక్కడ అడిగిన విధంగా మీరు మీ పేరు అప్డేట్ చేసిన తర్వాత , మీ ఓటర్ కార్డు, రేషన్ కార్డు ,పాన్ కార్డు లాంటివి ఏదో ఒక ఐడిని ప్రూఫ్ గా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇక ఆ తర్వాత మీరు మీ నంబర్ కి వచ్చిన otp ని ఎంటర్ చేస్తే పేరు మారుతుంది. ఇక వీటిలాగే డేట్ ఆఫ్ బర్త్ కూడా మార్చుకోవచ్చు.