ఐ ఫోన్ లో ఉపయోగించే సిరి వాయిస్ వెనుక ఉన్నది ఎవరో కాదు అమెరికాకు చెందిన సుసాన్ ఆలిస్ బెన్నెట్.ఈమె 2011వ సంవత్సరంలో అక్టోబర్ 4వ తేదీన ఐఫోన్ 4S లో సిరి అని ఒక సేవను ప్రవేశపెట్టినప్పటి నుండి ఆమె ఆపిల్ యొక్క సిరి వాయిస్ ను మనకు అందించడం జరుగుతోంది. ఇక అంతేకాకుండా ఈమె మహిళా అమెరికన్ వాయిస్ గా కూడా ప్రసిద్ధి చెందింది. ఆ తర్వాత ios7 ను రూపొందించినప్పుడు 2013 సెప్టెంబర్ 18వ తేదీన విడుదలయ్యే వరకూ బెన్నెట్ వాయిస్ ను సిరి గా ఉపయోగించడం గమనార్హం.