మన బ్యాంకు ఖాతా నుంచి డబ్బులు మనకు తెలియకుండానే మాయమవుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఒక టోల్ ఫ్రీ నెంబర్ ను తీసుకువచ్చింది. 155260 ఈ టోల్ ఫ్రీ నెంబర్ ను ఏప్రిల్ నెలలోనే ప్రారంభించినప్పటికీ ప్రస్తుతం ఇప్పుడు అందుబాటులోకి వచ్చింది ఈ నెంబర్. ఎంతోమంది అమాయకపు ప్రజల నుంచి దోచుకున్న సొమ్మును సైబర్ నేరగాళ్లు.. ఎన్నో బ్యాంకులకు మారుస్తూ ఉంటారు. అలా మారుస్తున్నప్పటికీ సిటిజన్ ఫైనాన్షియల్ సైబర్ ఫ్రాడ్ రిపోర్టింగ్ అలాగే నిర్వహణ వ్యవస్థ నుండి అధికారులు మన డబ్బులు తిరిగి వెనక్కు రప్పిస్తారు.