ప్రజల శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం ఈ - కామర్స్ సంస్థలు జరుపుతున్న మోసాలను అరికట్టేందుకు సరికొత్త నిర్ణయం తీసుకుంది. ఇకపై ఫ్లాష్ సేల్ పేరిట అమ్మకాలు నిర్వహించకూడదని చట్టం నిబంధనలను విధించింది. ఒకవేళ నిర్వహించాల్సి వస్తే ప్రజల నుండి ఇ సమస్యలను తీర్చడానికి ఒక అధికారిని కూడా నియమించాల్సిందిగా తెలిపింది.ఈ నిబంధనలను ఉల్లంఘించిన యెడల వారిపై రక్షణ చట్టం కింద 2019 లో కఠిన చర్యలు తీసుకునే విధంగా నిర్ణయించారు. అయితే ఇలాంటి నిర్ణయాలు తీసుకున్న ప్రభుత్వం ప్రజల నుంచి కూడా అభిప్రాయాలను స్వీకరించాలని కోరుతోంది. ప్రజలు ఏదైనా సందేహం పంపించాలంటే js-ca@nic.in కు జులై 6వ తేదీ లోపల పంపించాల్సి ఉంటుంది.