ట్విట్టర్ సేవలో ప్రొఫైల్ సరిగా లోడ్ అవడంలేదని, అలాగే పలు థ్రెడ్ లు కూడా ఓపెన్ అవ్వడం లేదని నెటిజనులు పేర్కొన్నారు. కానీ కొన్ని అతి ముఖ్యమైన ఫీచర్స్ మాత్రమే ఓపెన్ అవుతున్నాయని వారు తెలపడం జరిగింది. ముఖ్యంగా వారి ఖాతాలకు సంబంధించిన టైం లైన్ కూడా ఓపెన్ కావడం లేదని, దాంతో కొన్ని సందేశాలకు తిరిగి సమాధానం కూడా పంపలేక పోతున్నామని వారు వాపోతున్నారు.కానీ దీనికి కారణం ఏమిటో ఇప్పటి వరకు ట్విట్టర్ స్పందించలేదు.