ఇజ్రాయిల్ దేశం రక్షణ మంత్రిత్వ శాఖతో కలిసి పొలారిస్ సొల్యూషన్స్ అనే సంస్థ వారు కామెఫ్లాగ్ షీట్ పేరు మీద కిట్ 300 ఏర్పాటు చేశారు. ఇక దీనిని తయారు చేసేటప్పుడు మెటల్స్ , మైక్రో ఫైబర్స్, పాలిమర్స్ ను ఉపయోగించారు.ఒక్కసారి ఈ షీట్ ని ధరిస్తే, ఇక మామూలుగా చూసినా, థర్మల్ కెమెరాల ద్వారా చూసినా కూడా ఈ షీట్ ధరించిన వ్యక్తి ఎక్కడున్నారో కనిపించడం అసాధ్యం. ఇందులో ఉన్న ప్రత్యేకత ఏమిటంటే ..కొండల్లో యుద్ధం చేసేటప్పుడు బయటకి రాతి రంగు కనిపించేలా ఒంటికి చుట్టుకోవాలి. ఇక అదే అడవుల్లో యుద్ధం చేసేటప్పుడు పచ్చని రంగు బయటకు ఉండేలా చుట్టుకోవాలి.. తద్వారా శత్రువులు సైనికులను గుర్తుపట్టడం కష్టమవుతుంది