‘ఎన్టీఆర్ పక్కన ఉన్న ఈ వ్యక్తి ఎవరో తెలుసా?’ అంటూ ఆయన అభిమానులు ఆ ఫోటోని తెగ షేర్లు చేస్తున్నారు. 2018లో తెలంగాణలో జరిగిన ముందస్తు ఎన్నికలు ఫాలో అయిన వాళ్లకు ఎన్టీఆర్ పక్కన ఉన్న ఈమె ఎవ్వరో ఇట్టే అర్ధమైపోతుంది. ఆమె మరెవరో కాదు నందమూరి హరికృష్ణ కుమార్తె నందమూరి సుహాసిని. ముందస్తు ఎన్నికల్లో కూకట్ పల్లి నియోజకవర్గం నుండీ ఈమె పోటీ చేసింది. ఫలితం సంగతి పక్కన పెడితే.. తమ్ముడు తారక్ అంటే ఈమెకు చాలా ఇష్టం. వారి అనుబంధం ఎలాంటిదో ఈ ఫోటో స్పష్టంచేస్తోంది