అమెరికాలోని ఉటాకు చెందిన అబిగైల్ బ్రాడికి రెండేళ్ల కొడుకు ఉన్నాడు. అతడి పేరు థియో. అతడు ఎక్కడ ఉన్న తన బెస్ట్ ఫ్రెండ్ బెన్నీ ఉండాల్సిందే. బెస్ట్ ఫ్రెండ్ అంటే.. మనుషులని మాత్రం అనుకోవద్దు. బెన్నీ.. అంటే అస్థిపంజరం. అయితే, అది నిజమైన అస్థిపంజరం కాదులెండి, బొమ్మ అస్థిపంజరం. సాధారణంగా చిన్న పిల్లలు అలాంటి బొమ్మలను చూస్తే హడలిపోతారు. అయితే బ్రాడీ మాత్రం మనసు పాడేసుకున్నాడు.