అమెరికాలోని ఒహాయోలో మాస్క్ పెట్టుకోకుండా ఫుట్ఫుట్ బాల్ మ్యాచ్ చూసేందుకు వచ్చిన ఓ మహిళను పోలీసులు కరెంట్ షాక్ ఇచ్చి మరీ అరెస్ట్ చేశారు. మారియెటాలో బుధవారం ఓ స్కూల్లో జరిగిన మ్యాచ్ను చూడ్డానికి వచ్చిన అలిసియా కిట్స్ అనే మహిళ మాస్క్ పెట్టుకోకుండా వచ్చింది. కొడుకు ఫుట్బాల్ ఆడుతుంటే చప్పట్లు కొడుతూ రెచ్చిపోయింది.ఇది గమనించిన పోలీసులు.. ఆమె వద్దకు వెళ్లి మాస్క్ పెట్టుకోవాలని సూచించారు. అయితే, ఆమె ఇందుకు అంగీకరించలేదు. రెండు మూడు సార్లు మర్యాదగా చెప్పినా వినలేదు. పైగా బూతులు తిడుతూ.. పోలీసులను అక్కడి నుంచి వెళ్లిపోమంది. దీంతో పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకోడానికి ప్రయత్నించారు. టేజర్ గన్తో ఆమెకు షాకిచ్చి, చేతులకు బేడీలు వేశారు. ఈ ఘటన ఇప్పుడు అమెరికాలో చర్చనీయంగా మారింది. ఆమెను అరెస్టు చేస్తున్న దృశ్యాన్ని కింది వీడియోలో చూడండి.ప్రస్తుతం ఈ వీడియో తెగ వైరల్ అవుతుంది.