ఇంగ్లాండ్‌లోని బ్రిగ్టాన్ సిటీ సెంటర్లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఓ వ్యక్తి 12 అడుగుల పొడవైన కొండ చిలువను మెడలో వేసుకుని దర్జాగా మాల్లో నడుస్తూ కనిపించాడు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు అతడిని ప్రశ్నించారు. ఎరిక్ సెల్‌బే అనే వ్యక్తి ఇదంతా తన కెమేరాలో రికార్డు చేశాడు.