అమెరికాలోని ఉటాకు చెందిన మార్టిన్ బోనే(64) తన ఇంట్లో భారీ కొండ చిలువలను మేపుతున్నాడు. వాటికి ఆహారంగా పెట్టేందుకు సుమారు 585 ఎలుకలు, 46 కుందేళ్లను సైతం పెంచుతున్నాడు. ఇన్నాళ్లు వాటిని గుట్టుచప్పుడు కాకుండా బానే పెంచాడు. అయితే, తరచుగా ఆ ఇంటి నుంచి బయట పడేస్తున్న చెత్త స్థానికులకు ఇబ్బందిగా మారింది. అదేదో వింతైన దుర్వాసన వస్తుండటంతో కొందరు పోలీసులకు ఫిర్యాదు చేశారు.