మంగళవారం నాడు కురిసిన వర్షానికి ఈ ఒక్కరోజు బ్రతికితే చాలు దేవుడా... అనే పరిస్థితి వచ్చింది. కొన్ని చోట్ల అయితే మ్యాన్ హోల్స్ నిండిపోయాయి. చాలా చోట్ల ప్రాణ నష్టం కూడా జరిగింది. తెలంగాణలో వర్షాలు, హైదరాబాద్లో పరిస్థితులపై సీఎం కేసీఆర్ సమీక్షించారు. తెలంగాణలో ముఖ్యంగా... హైదరాబాద్లో ఎప్పుడూ లేనంత భారీ వర్షం పడటం వల్ల... ఎక్కడికక్కడ బస్తీలు, కాలనీలూ మునిగిపోవడంతో... ఔటర్ రింగు రోడ్డు పరిధిలో ఉన్న అన్ని ప్రాంతాలకూ రెండ్రోజులు సెలవులు ప్రకటించారు.ఇక ఇప్పట్లో ఈ వర్షం తగ్గుతుందా అనుకుంటే... ఇంకా రెండుమూడు రోజులు వర్షాలు ఇలాగే కొనసాగే ప్రమాదం ఉందని అంటున్నారు. ఇక జనాలకు కరోనా భయం పొయ్యి ఈ వర్షాల భయం పట్టుకుంది.