ఒక పేద ఆటో డ్రైవర్.. బాగా బలిసిన రాక్షసులతో పెట్టుకున్నాడు. మధ్యప్రదేశ్‌లోని జబల్పూర్లో చోటుచేసుకున్న ఈ ఘటన చూస్తే రక్తం ఉడికిపోతుంది. ఓ యువతి స్కూటీని ఆటో ఢీకొట్టింది. దీంతో ఆటోడ్రైవర్‌తో ఆ యువతి వాగ్వాదానికి దిగింది.  ఈ విషయాన్ని ఆమె తన స్నేహితులకు ఫోన్ చేసి చెప్పింది. దీంతో నలుగురు వ్యక్తులు అక్కడికి వచ్చారు. ఆటో డ్రైవర్‌ను కాళ్లతో తన్నుతూ అత్యంత దారుణంగా కొట్టారు. మరో వ్యక్తి అతడిని కిందపడేసి.. భవన నిర్మాణాలకు ఉపయోగించే ఇనుప షీట్లతో కొట్టాడు. దీంతో అతడు అపస్మారక స్థితికి చేరుకున్నాడు. అయినా సరే.. అతడు వదలకుండా ఆటో డ్రైవర్ జుట్టుపట్టుకుని కొడుతూనే ఉన్నారు. చివరికి బైకు మీద అడ్డంగా పడుకోబెట్టి తీసుకెళ్లిపోయారు.