ఒక క్యూట్ చిన్నారి విద్యార్థి చక్కగా యూనిఫాం ధరించి.. మెడలో ఐడీ కార్డ్ వేసుకుని స్మార్ట్ఫోన్లో ఆన్లైన్ క్లాసులను వింటూ వుంది. అదే సమయంలో అక్కడికి మూడు కొండ ముచ్చులు వచ్చాయి. మహాత్ముడి కోతుల్లా.. ఎంతో బుద్ధిగా కిటికీకి వేలాడుతూ.. ఆ చిన్నారితో పాటే ఆన్లైన్ పాఠాలు విన్నాయి. దీంతో ఆశ్చర్యపోయిన ఆ విద్యార్థి తల్లిదండ్రులు ఫొటో తీసి పోస్ట్ చేశారు. అంతే.. అది క్షణాల్లో వైరల్గా మారింది.