మన వంటకాలు ఎప్పుడూ ప్రత్యేకమే. ఈ నేపథ్యంలో తైవాన్ అధ్యక్షురాలు సాయ్ ఇంగ్-వెన్ (Tsai Ing-Wen) చేసిన ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. భారతీయ వంటకాలతో ఉన్న ఫొటోను ట్వీట్ చేసిన ఆమె.. ‘‘ఎన్నో భారతీయ భారతీయ రెస్టారెంట్లకు కేంద్రంగా ఉన్న తైవాన్ చాలా లక్కీ. తైవాన్ ప్రజలు కూడా వాటిని ఎంతగానో ఇష్టపడతారు. నేను ఎప్పుడు వెళ్లినా.. చనా మసాలా, నాన్, చాయ్ తీసుకుంటాను. వాటిని చూడగానే నాకు ఇండియాలో పర్యటించిన రోజులు గుర్తుకొస్తాయి. మరి మీకు నచ్చిన భారతీయ వంటకం ఏమిటీ?’’ అని ట్వీట్ చేశారు.