‘బాపు గారి బొమ్మలా’ అలంకరించుకుని..ఆ టైములో తనను పెయింటింగ్ వేస్తే’ చూసుకోవాలని రాశీకి ఎప్పటి నుండో ఆశట. ఆ కల కెమెరామెన్ ఫోటోగ్రాఫర్ శ్రావణ్ కుమార్ ద్వారా నెరవేరిందని ఆమె చెప్పుకొచ్చింది. అంతే కాదు.. తనని తాను ఆ ఫోటోలలో చూసుకుంటే, ఓ పాట కూడా పడాలని ఉందంటూ కూడా తన సోషల్ మీడియాలో పేర్కొంది. ఈ ఫోటోలలో రాశీ నిజంగానే బాపు బొమ్మలా ఉంది.