మహారాష్ట్రలోని చంద్రపూర్‌లో నివసిస్తున్న రామచంద్ర దనేకర్ అనే ఈ హోమియోపతి డాక్టర్ 87 ఏళ్ల వయస్సులో సైతం వైద్యం అందిస్తూనే ఉన్నారు. ఈ వయస్సులో కరోనా సోకితే.. ప్రాణాలకే ముప్పని తెలిసినా కూడా.. ఆయన ఏ మాత్రం వెనకడుగు వేయకుండా రోగులకు వైద్యం అందిస్తున్నాడు. తన సైకిల్‌పై ఇంటింటికి వెళ్తూ.. కరోనాతో బాధపడుతున్న పేద రోగులకు చికిత్స చేస్తున్నారు.