కేరళలోని త్రిస్సూర్ జిల్లా ఎడ్వవిలాంగు గ్రామంలో నివసిస్తున్న నిసార్ ఈ బైక్‌ను తయారు చేశాడు. ఈ బైకు తయారీ కోసం అతడు ఎక్కువ పరికరాలు ఏమి కొనలేదు. కేవలం రెండు టైర్లు మాత్రమే కొన్నాడు. మిగతా సామాన్లు వ్యర్థాల దుకాణంలో కొనుగోలు చేశాడు. ఈ బైకు తయారీకి సుమారు ఒక సంవత్సరం పాటు శ్రమించాడు. రేయింబవళ్లు నిద్రపోకుండా చాలా శ్రమించి ఈ బైక్ ని తయారుచేసాడు. చివరికి తన కలను నెరవేర్చుకున్నాడు. 48V DC మోటార్‌తో నడిచే ఈ బైక్ ఎలాంటి కాలుష్యాన్ని వెదజల్లదు. దీని మార్కెట్లో పెడితే సుమారు రూ.లక్ష వరకు ధర పలకవచ్చని నిసార్ భావిస్తున్నాడు. ఈ బైకును చూస్తే.. షోరూమ్ నుంచి వచ్చిన కొత్త బైకనే అనుకుంటారు. ఇప్పుడు నిసార్.. తను సొంతంగా తయారుచేసుకున్న ఈ బైక్ తో హ్యాపీ గా ఊరు ఊరంతా తిరుగుతున్నాడు. అతను భవిష్యత్ లో ఇంకా ముందుకు వెళ్లాలని కోరుకుందాం.