దుకాణ యజమాని అల్బిన్కు వచ్చే పెళ్లి సంబంధాలను చెడగొట్టడం మొదలుపెట్టాడు. దీంతో అల్బిన్ ఆగ్రహం కట్టలు తెంచుకుంది. జేసీబీతో ఆ దుకాణాన్ని కూల్చిపడేసి అతడిపై ప్రతీకారం తీర్చుకున్నాడు. మలయాళ చిత్రం ‘అయ్యప్పనం కోశియం’ సినిమా పాటను పెట్టి.. ఆ సినిమాలోని రియల్ లైఫ్ సీన్ అంటూ వీడియోను ‘యూట్యూబ్’లో పోస్టు చేశారు. దీంతో ఈ వీడియో క్షణాల్లో వైరల్గా మారింది. దీనిపై షాపు యజమాని స్పందిస్తూ.. అతడి ఆరోపణల్లో నిజం లేదని, వ్యక్తిగత కక్షతోనే అల్బిన్ తన దుకాణాన్ని కూల్చేశాడని తెలిపాడు.