మాములుగా మార్కెట్లో టీ పొడి రేటు ఎంతుంటుంది మహా అంటే ఒక పది రూపాయలు నుంచి ఒక ఐదు వందల రూపాయలు దాకా ఉంటుంది. కాని ఈ టీ పొడి మాత్రం ఏకంగా 75 వేల రూపాయలు పలికిందట. ఆ రేటుతో ఒక మధ్య తరగతి కుటుంబం వారు ఒక మంచి టూ వీలర్ బైక్ నే కొనుక్కుంటారు. లేదా ఒక ఆరునెలలు దాకా సరిపడా సరుకులు కొనుక్కుంటారు... ఇక ఇండియా హెరాల్డ్ అందిస్తున్న పూర్తి వివరాల్లోకి వెళితే.... గౌహతీ టీ ఆక్షన్ సెంటర్ (జిటిఎసీ) ఇటీవల ప్రత్యేకమైన టీని వేలానికి పెట్టింది. దీన్ని కొనుగోలు చేసేందుకు పలు టీ సంస్థలు పోటీపడ్డాయి. దీంతో కిలో టీ రూ.75 వేలకు అమ్ముడుపోయింది. కాంటేంప్రరీ బ్రోకర్స్ ప్రైవట్ లిమిటెడ్ సంస్థ ఈ టీని కొనుగోలు చేసినట్లు జిటిఎబిఎ సెక్రటరీ దినేష్ బిహానీ వెల్లడించారు.