మన దేశానికి రైతులు అన్న దాతలు. అలాంటి రైతులు ఎంత కష్టపడతారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. పొలాల్లో ఊడ్పులు తర్వాత మిగిలే గడ్డిని పొగేసి ఒక చోట చేర్చడం రైతులకు చాలా కష్టమైన పని. అదంతా చెయ్యాలంటే చాలా టైమ్ పడుతుంది. అందుకే ఈ క్రమంలో హర్యానాలోని రైతులు సరికొత్త ట్రాక్టర్ మౌంటెడ్ మెషిన్ తో గడ్డిని ఊడ్చేస్తున్నారు. ట్రాక్టర్కు ఏర్పాటు చేసిన ఈ యంత్రం... పొలంలో పోగేసిన గడ్డి మీదుకు ప్రయాణిస్తే చాలు. అది నేలపై ఉన్న గడ్డిని గ్రహించి గుండ్రంగా చక్రంలా మార్చేసి బయటకు వదిలేస్తుంది. ఈ యంత్రం పనితీరును చూస్తే మీరు తప్పకుండా ఆశ్చర్యపోతారు.