తుర్క్ మీనిస్థాన్ అధ్యక్షుడు మాత్రం దేశాన్ని మంచిగా పాలించాలని కోరుతూ ప్రజలు అతన్ని సింహాశనంపై కూర్చోపెడితే .. ఆ నాయకుడు మాత్రం దాన్ని దర్జాగా భావించాడు. ప్రజాధనాన్ని తన ఆస్థిలా భావించి నగరం నడిబొడ్డున భారీ కుక్క విగ్రహాన్ని ఏర్పాటు చేయించాడు. పోనీ అతడికి కుక్కలంటే ఇష్టం కాబోలు.. మూగజీవులను ప్రేమించండనే సందేశంతో అది పెట్టించాడని అనుకుంటే కాస్త కష్టమైనా పర్వాలేదని అనిపిస్తుంది. కానీ, అతడు ఆ విగ్రహాన్ని బంగారు పూతతో కట్టించాడు. దీంతో.. అంతా ఆ దేశ ప్రజలు ఆ అధ్యక్షుడిని బాగా తిట్టేస్తున్నారు. తుర్క్మెనిస్థాన్లో జరిగిన ఈ ఘటన ఇప్పుడు ప్రపంచమంతటా చర్చనీయంగా మారింది.