అక్కరాయ్పట్టీ గ్రామానికి చెందిన రైతు ఇలాంగోవన్‌కు, నటరాజన్‌కు గత కొన్నాళ్లుగా ఒక భూమి విషయం మీద వివాదం నడుస్తోందట. ఈ విషయం తేల్చుకోవడం కోసం వాళ్లిద్దరూ కూడా కోర్టును ఆశ్రయించారు. కోర్టు ఇలాంగోవన్‌కు అనుకులంగా తీర్పు ఇచ్చింది.ఈ విషయం పై నటరాజన్ హైకోర్టుకు అప్పీల్ చేసుకున్నాడు. అయితే, మంగళవారం ఉదయం నటరాజన్, ఇలాంగోవన్ మధ్య పెద్ద గొడవ జారిందట. దీంతో నటరాజన్ రోడ్డు పక్కన నిలుచున్న ఇలాంగోవన్ తో పాటు అతనితో వచ్చిన మరో రైతను తన దగ్గరున్న తుపాకీతో కాల్చాడు. ఈ ఘటన ఆ ఎదురుగా వున్నా ఒక ఇంట్లోని సీసీటీవీ కెమేరాలో స్పష్టంగా రికార్డు అవ్వటం జరిగింది.