ఈజిప్టులోని అస్సియట్ యూనివర్శిటీ అనే పిల్లల ఆసుపత్రిలో ఈ అరుదైన శిశువు జన్మించాడు. ఈ విషయం గురించి పీడియాట్రిక్ సర్జరీ నిపుణులు అయినా అహ్మద్ మహెర్ అలీ వివరించాడు.. ఈ సమస్యను కాడల్ డూప్లికేషన్ సిండ్రోమ్ అంటారని తెలిపారు. కడుపులో పెరిగే కవలలు.. పూర్తిగా విడిపోకపోతే ఈ సమస్య ఏర్పడుతుందన్నారు. ఇలా పుట్టిన శిశువులకు రెండేసి అవయవాలు ఉంటాయని, వాటిని విడదీయడం చాలా కష్టమని వివరించారు.