ఇంగ్లాండ్‌లోని ఎసెక్స్ కౌంటీలో మన్నింగ్ ట్రీ ప్రాంతంలో పోర్స్చే టేకాన్ కారును ఓ ఇంటి ముందు పార్క్ చేయబోయిన డ్రైవర్ అదుపుతప్పి.. ఎదురుగా ఉన్న ఎస్‌యూవీని ఢీకొట్టాడు. ఆ తర్వాత ఆ రోడ్డుకు దిగువన ఉన్న మరో కారు మీద ల్యాండైంది. దీంతో ఆ మూడు కార్లు బాగా దెబ్బతిన్నాయి.ప్రమాదం జరిగిన ఇంటికి ఎదురుగా ఉన్న మరో ఇంట్లోని సీసీటీవీ కెమేరాలో ఈ ఘటన రికార్డైంది.