ప్యాసెంజర్స్ తో   సియాన్-పాన్వెల్ హైవే మీద ప్రయాణిస్తున్న ఓ బస్సు అకస్మాత్తుగా మంటల్లో చిక్కుకుంది. ముంబయి నుంచి సొల్హాపూర్ వైపు వెళ్తున్న ఈ బస్సులో ఒక్కసారిగా పొగలు వచ్చాయి. దీంతో ప్రయాణికులు బస్సు నుంచి బయటకు పరుగులు పెట్టారు. ఈ మంటల్లో ఓ ప్రయాణికుడు చిక్కుకున్నాడు. చివరికి అతడిని ప్రాణాలతో రక్షించారు. బస్సులోని బ్యాటరీలో షార్ట్ సర్క్యూట్ వల్లే ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు తెలిసింది. ఈ సమాచారం తెలియగానే అగ్నిమాపక సిబ్బంది మంటలను అందుపులోకి తెచ్చేందుకు ప్రయత్నించారు. కానీ, అప్పటికే బస్సులో మంటల్లో బుగ్గయ్యింది. అయితే, ఈ ప్రయాణికులు ఎవరికీ గాయాలు కాలేదు.