ఈజిప్షియన్ మోడల్ సల్మా అల్-షిమికి కైరోలో గల పిరమిడ్ ఆఫ్ జొజర్ వద్ద అలనాటి ప్రాచీన సంప్రదాయ బట్టలతో ఫొటోలు, వీడియోలు తీయించుకుంది. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అవి కాస్త వైరల్‌గా మారాయి. దీంతో పోలీసులు షిమితోపాటు ఫొటోగ్రాఫర్‌ను కూడా అరెస్ట్ చెయ్యడం జరిగింది. సక్కారా నెక్రోపోలిస్ వద్ద గల ఆర్కియలాజికల్ జోన్లో అనుమతి లేకుండా ఫొటోషూట్ చేశారని, యాంటిక్విటీస్ మినిస్ట్రీ నిబంధనలకు ఇది విరుద్ధమని పోలీసులు ముందుగానే వెల్లడించారట . అయితే, ఈ ఫొటోలపై ప్రభుత్వ చెబుతున్న కారణాలేవీ స్పష్టంగా లేకపోవడంతో నెటిజనులు విమర్శలు చేస్తున్నారు.