ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ వైరల్ న్యూస్ చదవండి....మనం ఎన్నో లీవ్ లెటర్ లని చూసి ఉంటాము. కాని ఇలాంటి లీవ్ లెటర్ ని ఎప్పుడు చూసి ఉండము.వివరాల్లోకి వెళితే... భోపాల్ సిటీలో ట్రాఫిక్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న దిలీప్ కుమార్ అహిర్వార్.. తన భార్య బంధువు పెళ్లికి హాజరయ్యేందుకు సెలవు పెట్టాలని నిర్ణయించుకున్నాడు. ఈ సందర్భంగా తన పైఅధికారికి లీవ్ లెటర్ రాశాడు. ఇక ఆ లీవ్ లెటర్ చూసి అధికారి షాకయ్యాడట.. మొదటి పేరాలో అన్నీ బాగానే రాసినా.. చివరి పేరాలో మాత్రం... ఇలా చెప్పాడు...‘‘నేను నా భార్య బావ పెళ్లికి హాజరుకాకపోతే.. తీవ్ర పరిణామాలు ఎదుర్కోవలసి వస్తుందని నా భార్య హెచ్చరించింది’’ అని తెలిపాడు.