డమ్ఫ్రయిస్కు చెందిన క్వామే క్రాస్ అనే వ్యక్తి.. 160 లాటరీ టికెట్లు కొన్నాడు. అన్ని టికెట్లలో 7314 నెంబర్లు ఉండేలా చూసుకున్నాడు. ఫలితాలు చూసి తనని తానే నమ్మలేకపోయాడు. ఎందుకంటే.. అన్ని సీరిస్‌ల్లోనూ అతడు టాప్ ఫ్రైజ్‌ను గెలుపొందాడు. ఈ సందర్భంగా అతడు మొత్తం ఎనిమిది లక్షల డాలర్లు (రూ.5.89 కోట్లు) గెలుపొందాడు.