ఓ పెట్రోల్ స్టేషన్లో కొంతమంది యువకులు ఒక చోటకు చేరి కేక్ కట్ చేస్తున్నారు. అదే సమయంలో వారి వెనుకాల ఏదో తెల్లని ఆకారం పరిగెడుతూ కనిపించింది. సుమారు రెండు నుంచి మూడు సెకన్లు మెరుపుతీగలా కనిపించి మాయమైంది. అయితే, మొదట్లో ఆ యువకులు ఈ విషయాన్ని గుర్తించలేదు. వీడియోను మళ్లీ చూసుకున్నప్పుడు వారికి ఆ ఆకారం కనిపించింది.