నాగాల్యాండ్లో ఓ లారీ అదుపుతప్పి లోయలో పడిపోయింది. దాన్ని బయటకు తీయడానికి అవసరమైన భారీ క్రేన్లు, ప్రొక్లయిన్లను తరలించేందుకు ఆ ప్రాంతం అనుకూలంగా లేదు. దీంతో గ్రామస్తులే ఇందుకు నడుం బిగించారు. మూడు వైపులా తాళ్లు కట్టారు. సుమారు వందకు పైగా గ్రామస్తులు తాళ్లను పట్టుకుని లారీని పైకి లాగడం ప్రారంభించారు. ఎక్కడా పట్టు వదలకుండా.. అంతా ఒకేసారి తాళ్లను గట్టిగా లాగుతూ లారీని రోడ్డు మీదకు లాగేశారు.