పూర్వీకుల ఆచారాన్ని పాటించడంలో భాగంగా కుందుర్పి మండలం శ్రీమజ్జనపల్లి గ్రామం సోమవారం పూర్తిగా ఖాళీ అయింది. గ్రామం చుట్టూ ముళ్లకంచె వేసి సోమవారం మధ్యాహ్నం 12 నుంచి మంగళవారం మధ్యాహ్నం 12 గంటల వరకు గ్రామస్తులు ఊరు వదిలి వెళ్లారు.