వన్య ప్రాణాలను చూసేందుకు టాప్‌లెస్ జీపుల్లో ఫారెస్ట్ టూర్ చేసిన పర్యాటకులకు అకస్మాత్తుగా ఓ పులి కనిపించింది. అది గోడకు అవతలి పక్కన ఉండటంతో అంతా ధైర్యం చేసి ఫొటోలు, వీడియోలు తీసుకోవడం మొదలుపెట్టారుఅయితే.. నిశబ్దంగా ఉండకుండా గోల గోల చేసి పులిని రెచ్చగొట్టారు. దీంతో ఆ పులికి చిర్రెత్తుకొచ్చింది. వాళ్ల తిక్క తీర్చాలని అనుకుందో ఏమో.. ఒక్కసారిగా గోడ మీదకు దూకింది. అంతే.. ఆ వాహనాల్లో ఉన్న టూరిస్టులకు గుండె ఆగినంత పనైంది. పులి ఒక్కసారి అలా మీదకు రావడం చూసి.. అది దాడి చేస్తుందేమో అని హడలిపోయారు. అయితే, ఆ పులికి యాంగర్ మేనెజ్మెంట్ తెలుసో ఏమో.. చాలా కూల్‌గా అక్కడి నుంచి వెళ్లిపోయింది. బహుశా.. ఆ సమయంలో యముడు కూడా సెలవులో ఉండి ఉంటాడు. అందుకే వాళ్లు బతికిపోయారు.