మహారాష్ట్రకు చెందిన ఈ ముగ్గురు యువకులు గురించి తెలుసుకోవల్సిందే. కరోనా వైరస్, లాక్డౌన్ నేపథ్యంలో చాలామంది ఉద్యోగులు ఇంటి నుంచే పని చేస్తున్న సంగతి తెలిసిందే. ఇలా రోజులు తరబడి ఇంట్లోనే ‘వర్క్ ఫ్రం హోమ్’ చేయడాన్ని కొంతమంది బోర్గా ఫీలవ్వుతున్నారు. ఆ యువకులు కూడా అలాగే భావించారు. అందుకే.. సైకిళ్లు పట్టుకుని బయటి ప్రపంచాన్ని చుట్టేయాలని బ్యాక్సెన్ జార్జ్, అల్వీల్ జోసెఫ్, రాతీష్ భలేరావ్లు నిర్ణయించుకున్నారు. ముంబయి నుంచి కర్ణాటక మీదుగా కన్యాకుమారి వరకు సైకిల్ మీదే ప్రయాణించారు. మధ్య మధ్యలో హోటళ్లు, చిన్న షాపుల వద్ద ఆగి ఆఫీస్ పనులు చేసుకొనేవారు. పని పూర్తికాగానే.. మళ్లీ సైకిలింగ్ చేసేవారు. ఇలా వారు 24 రోజుల్లో 1600 కిమీలు ప్రయాణించారు.