గ్రామ పంచాయతీలు పారిశుద్ధ్యాన్ని గ్రామాల్లో పెంపొందించడానికి పల్లె ప్రగతి పేరిట ఇంటింటా చెత్తను సేకరించి వర్మీ కంపోస్ట్ షెడ్లలో తడి చెత్త పొడి చెత్త గా విభజించి వాటి ద్వారా సేంద్రియ ఎరువులను తయారు చేస్తున్నాయి. ఇలా తయారు చేసిన సేంద్రియ ఎరువులను తిరిగి రైతులకు అమ్మి లాభార్జన పొందుతున్నాయి. ఈ క్రమంలో ఎంతో మంది కార్మికులకు జీవనోపాధి లభిస్తోంది . అంతేకాకుండా రైతులకు కూడా తక్కువ ధరలో సహజసిద్ధమైన ఎరువులు లభించడం విశేషం.