ఎలాంటి వైరస్ అయిన 95 శాతం వరకు నిర్వహించేలా, యాంటీవైరల్ కోటింగ్ మాస్క్ లను అభివృద్ధి చేసేందుకు "యూనివర్సిటీ ఆఫ్ కేంబ్రిడ్జ్" శాస్త్రవేత్తలు కసరత్తు ముమ్మరం చేశారు.. డయాక్స్ పేరుతో పిలిచే,యాంటీవైరల్ కోటింగ్ టెక్నాలజీ మాస్క్ యూజర్లకు ప్రాణాంతకం అయిన కరోనా వైరస్ క్రిముల నుంచి కాపాడుతుందని వైద్య శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. ఈ మాస్క్ పై ఉండే యాంటి వైరల్ కోటింగ్ సమర్థవంతంగా నిర్వహిస్తుందని "కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ కెమికల్ ఇంజనీరింగ్, బయోటెక్నాలజీ,సీనియర్ లెక్చరర్ డాక్టర్ గ్రాహం క్రిస్టి " పేర్కొన్నారు. ఫేస్ మాస్క్ ల పై ఉండే యాంటీ వైరల్ కోటింగ్ గంట వ్యవధిలోనే అన్నిరకాల కరోనా స్ట్రెయిన్ లను చంపి వేస్తుందని ఆయన తెలిపారు.