జపాన్ ప్రభుత్వం ప్రస్తుతం వ్యాపిస్తున్న కరోనా కారణంగా రెస్టారెంట్ కు వచ్చే ప్రజలు మాట్లాడకుండా తినాలనే నిబంధనలు విధించింది. ఎందుకంటే తింటూ మాట్లాడేటప్పుడు కరోనా గాల్లోకి కలిసి తద్వారా ఇతరులకు సోకే ప్రమాదం ఉందని, అందుకే ఇలాంటి నిబంధనలు విధించినట్లు అక్కడి ప్రభుత్వం తెలుపుతోంది. ఇదిలా ఉండగా జపాన్ లోని క్యోటో నగరం మాత్రం ఓ అడుగు ముందుకేసి 'సైలెంట్ ఈటింగ్'పై ప్రజల్లో అవగాహన కలిగించే విధంగా నాలుగు కార్టూన్లతో పోస్టర్ రూపొందించింది. ఏదిఏమైనప్పటికీ జపాన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఒక అంతకు మంచిదే అని చెప్పవచ్చు...