కొమరం భీం జిల్లా ఆసిఫాబాద్ మండలం గుండి గ్రామంలో ప్లాస్టిక్ బియ్యం కలకలం రేపుతోంది . పూలాజీ బాబా ఆశ్రమం వద్ద అన్నదాన కార్యక్రమం లో ప్లాస్టిక్ బియ్యం రావడం అందర్నీ కలవరపరిచింది. అన్నం పూర్తిగా మారిపోవడంతో పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి. అక్కడకు వచ్చిన ఆ స్థానికులు ఆ బియ్యాన్ని పరిశీలించగా అవి ప్లాస్టిక్ బియ్యం అని అనుమానం వ్యక్తం చేశారు. అప్పటికే కొంతమంది భోజనం చేయడంతో వారు ఆందోళనకు గురయ్యారు.