మహా అయితే ఆవు పాలను ఎవరైనా దొంగతనం చేస్తారు, అసలు ఆవు పేడను ఎందుకు దొంగతనం చేస్తారని మీరు అనుకుంటున్నారు కదూ. అక్కడికే వస్తున్నాం. ఆవు పాలకంటే, ఇప్పుడు ఆవు పేడకి బాగా డిమాండ్ పెరిగింది. గోమాత మూత్రం, గోమాత పేడ.. అత్యంత కాస్ట్ లీ గా మారిపోయాయి. అయితే దీనికోసం దొంగతనాలు జరగడమే ఇక్కడ విచిత్రం. ఇంకా వింతైన విషయం ఏంటంటే.. ఈ దొంగతనాలను ఆపేందుకు సీసీ టీవీ కెమెరాలను పెట్టాలని చత్తీస్ గఢ్ ప్రభుత్వం నిర్ణయించింది. గౌ-దాన్ కేంద్రాల్లో సీసీ టీవీల కొనుగోలుకు ఆర్డర్ ఇచ్చింది.