2002లో 20 మొక్కలను మూడెకరాల బత్తాయి తోట గట్టు పైన నాటాను. కానీ సపోర్టింగ్ మొక్కలను పెంచలేదు. అవి పెరుగుతున్న సమయంలో పక్కనే ఉన్న బత్తాయి మొక్కలు చనిపోయాయి. దీంతో శ్రీగంధం మొక్కలను అలాగే వదిలేశా. అందువల్ల పక్కనున్న మొక్కలు సహాయంతో అవి పెరిగి పెద్దవయ్యాయి. కొన్ని రోజుల తర్వాత ఒక చెట్టుకు ఎవరో రంధ్రాలు చేసి వెళ్ళారు. అటవీశాఖ అధికారులకు చెప్పడంతో కోతకొచ్చాయో..లేదో.. అని దొంగలు పరిశీలించారని చెప్పారు. కొన్నేళ్ళ తర్వాత గాలివానకు చెట్లు కూలడంతో, దానిని కొడుతుంటే సెంటు వాసన వచ్చింది. దీంతో అటవీ శాఖ అనుమతి తీసుకొని హైదరాబాదులోని డీలర్ చెప్పిన విధంగా జాగ్రత్త గా కట్ చేసి విక్రయించారు.అవగాహన లేకపోవడంతో కిలో 6 వేలకు విక్రయించారు. 20 చెట్లకు రూ. 36 లక్షల ఆదాయం వచ్చింది. అంతే కాకుండా ఇప్పుడు 600 మొక్కలు పెంచుతున్న వాటి వయస్సు రెండేళ్లు. అని చెప్పుకొచ్చారు ఇస్తాపురెడ్డి