రేషన్ కార్డు కలిగిన వారిలో కుటుంబంలో ఎవరైనా మరణిస్తే, వెంటనే అధికారులను సంప్రదించి చనిపోయిన వ్యక్తి పేరును రేషన్ కార్డు నుంచి తొలగించుకోవాలి. అలా చేయకుండా రేషన్ సరుకులు పొందితే మాత్రం ఇబ్బందులు పడాల్సి ఉంటుంది. కార్డులో ఇతర పేర్లను వినియోగించుకున్నా లేదా చనిపోయినవారి పేర్లతో రేషన్ సరుకులు పొందినా, అధికారులు అక్రమాలకు పాల్పడినవారిపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు పోలీసు కేసు నమోదు చేసే అవకాశాలు ఉన్నాయి.