శ్రీలంక ఒకప్పటి అధ్యక్షుడు రాజపక్స.. దేశ పర్యటన సందర్భంగా మధ్యప్రదేశ్ లోని సాంఛీ స్థూపానికి 5 కిలోమీటర్ల దూరంలో తమ దేశం నుంచి తీసుకొచ్చిన పవిత్ర బోధివృక్షం ను ఇక్కడ నాటారు. అప్పటి నుంచి ఆ మొక్కను మధ్యప్రదేశ్ సర్కార్ జాగ్రత్తగా కాపాడుతోంది.మధ్యప్రదేశ్ లోని ఆ బోధి వృక్షానికి 24 గంటల పాటు భద్రతను ఏర్పాటు చేసింది. చెట్టు రక్షణ కోసం సెక్యూరిటీ గార్డులను కూడా ఎంపిక చేసింది. చెట్టు చుట్టూ 15 అడుగుల ఎత్తులో ఇనుప కంచెను ఏర్పాటు చేసింది. అంతే కాకుండా ఈ వృక్షానికి ఏడాదికి 15 లక్షల వరకు ఖర్చు చేస్తోందట